ఎయిర్‌పోర్టులో దిగిన మహిళ.. చెకింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిన వైనం.. చివరకు అసలు విషయం తెలిసి..

ABN , First Publish Date - 2021-12-30T01:51:53+05:30 IST

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ మహిళ.. విమానం దిగి వస్తోంది. అయితే ఆమెను చూసిన అధికారులకు అనుమానం వచ్చింది. తీరా చెకింగ్ చేసే సమయంలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. కంగారుపడిన అధికారులు..

ఎయిర్‌పోర్టులో దిగిన మహిళ.. చెకింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిన వైనం.. చివరకు అసలు విషయం తెలిసి..
ప్రతీకాత్మక చిత్రం

ఎయిర్‌పోర్టులో పలువురు విదేశాల నుంచి వస్తూ.. పట్టుబడిన వార్తలు గురించి వింటూ ఉంటాం. నిషేధిత వస్తువులు తరలిస్తూ కొందరు, నిబంధనలు అతిక్రమిస్తూ మరికొందరు పట్టుబడుతుంటారు. అయితే ఎక్కువ శాతం మంది మత్తుపదార్థాలు, బంగారు తీసుకొస్తూ అరెస్టవుతుంటారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇలాగే ఓ మహిళ.. విమానం దిగి వస్తోంది. అయితే ఆమెను చూసిన అధికారులకు అనుమానం వచ్చింది. తీరా చెకింగ్ చేసే సమయంలో ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయింది. కంగారుపడిన అధికారులు.. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని.. అంతా షాక్ అయ్యారు..


ఇటీవల ఇతర దేశాల నుంచి మత్తు పదార్థాలు, బంగారు తదితరాలను తీసుకొస్తూ.. పోలీసులకు పట్టుబడడం ఎక్కువైంది. తాజాగా ఉగాండాకు చెందిన ఓ మహిళ లాగోస్ నుంచి ఢిల్లీ ఏయిర్‌పోర్టుకు చేరుకుంది. అయితే ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె తప్పించుకోవాలనే క్రమంలో వెళ్తూ వెళ్తూ.. ఒక్కసారిగా కుప్పకూలింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను చూసి.. అధికారులు, సిబ్బంది కంగారు పడ్డారు. హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..


మెలకువ రాగానే భయంతో జరిగిన విషయం మొత్తం చెప్పేసింది. న్యూఇయర్ వేడుకలు సమీంచడంతో ఉగాండా నుంచి కొకైన్ సరఫరా చేస్తున్నారని, ఈ క్రమంలో రూ.14 కోట్ల విలువ చేసే కొకైన్‌తో నింపిన 91 క్యాప్సిల్స్‌ని మింగినట్లు పోలీసుల విచారణలో తెలిపింది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి.. అతి కష్టం మీద వాటిని వెలికితీశారు. దీంతో మహిళకు ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. మత్తు పదార్థాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎవరు తరలిస్తున్నారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ముహూర్తాలు లేవని ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్.. కానీ వరుడితో విసిగి ఈ యువతి నిర్ణయమిదీ..!

Updated Date - 2021-12-30T01:51:53+05:30 IST