వృద్ధురాలైన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి.. మత్తులోకి వెళ్లాక ఈ కొడుకు చేసిన నీచమిది.. ఏం జరిగిందో ఆలస్యంగా ఆమె గ్రహించి..
ABN , First Publish Date - 2021-12-17T23:48:48+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి, తన భార్యతో కలిసి తల్లికి నిద్రమాత్రలు తినిపించాడు. వృద్ధురాలు మత్తులోకి జారుకున్నాక.. అతడు చేసిన పని వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన తర్వాత అతడి తల్లి ఏం చేసిందంటే..
విలాసాలకు అలవాటు పడిన వారు, నేర స్వభావం కలవారు.. డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు. కొందరైతే కుటుంబ సభ్యలును చంపడానికి కూడా వెనుకాడరు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు అనే బంధాలను కూడా మరిచిపోయి చాలా మంది దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతుంటారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి, తన భార్యతో కలిసి తల్లికి నిద్రమాత్రలు తినిపించాడు. వృద్ధురాలు మత్తులోకి జారుకున్నాక.. అతడు చేసిన పని వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన తర్వాత అతడి తల్లి ఏం చేసిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో శారద అనే వృద్ధురాలు తన ఇద్దరు కొడుకులైన శేషనాథ్ జైస్వాల్, అమర్‌జిత్ జైస్వాల్ వద్ద ఉంటూ కాలం వెళ్లదీస్తోంది. శారద భర్త చనిపోవడంతో ప్రస్తుతం కుమారుల వద్దే ఉంటోంది. ఈమెకు ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అలాగే ఆమె బ్యాంకు ఖాతాలో ఇన్యూరెన్స్ సొమ్ము కూడా ఉంది. దీంతో పాటు కొన్ని స్థిరాస్తులు కూడా ఉన్నాయి. వృద్ధురాలి చిన్న కొడుకు అమర్‌జిత్ జైస్వాల్ మొదటి నుంచీ నేర స్వభావం కలవాడు. ఆస్తిలో తన అన్నకు భాగం వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఏదో ఒక కేసులో అన్నను ఇరికిస్తే.. ఆస్తి మొత్తం తనకే వస్తుందని ఆలోచించేవాడు. ఈ క్రమంలో 2018లో ఓ రోజు తన ఇంట్లో కార్బైన్ పదార్థాలను ఉంచి, తనకు తెలిసిన పోలీసు ఇన్ఫార్మర్ ద్వారా కేసులో ఇరికించాడు. ఆ కేసులో శిక్ష అనుభవించిన పెద్ద కొడుకు శేషనాథ్ జైస్వాల్, మరో వ్యక్తి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు.
బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..
నేర స్వభావం గల చిన్నకొడుకు అమర్‌జిత్ జైస్వాల్.. అంతటితో ఆగలేదు. తన తల్లికి సంబంధించిన నగదును కూడా కొట్టేయాలని కుట్రపన్నాడు. ఓ రోజు తన భార్యతో కలిసి తల్లి శారదకు నిద్రమాత్రలు తినిపించాడు. కొద్ది సేపటికి ఆమె నిద్రలోకి జారుకుంది. తర్వాత తన ఫోన్‌లో ఆమె బొటనవేలి ముద్రలు వేయించి, పింఛన్ మొత్తం, బ్యాంకు ఖాతాలోని రూ.22వేలను తీసుకున్నాడు. విషయం బయటికి రాకుండా తల్లిని ఇంట్లో బంధించి తలుపులు వేసి బయటికి వెళ్లేవారు. చివరకు విషయం తెలుసుకున్న వృద్ధురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా, అమర్జీత్‌పై వివిధ పోలీస్ స్టేషన్లలో అప్పటికే 5కేసులు నమోదయ్యాయని తెలిసింది.