అదొక ఖరీదైన బంగళా.. లోపల కిచెన్ నుంచి సీక్రెట్ గదులకు ప్రత్యేక మార్గం.. మనసు బాలేనప్పుడల్లా ఆ యువతి అక్కడికే వెళ్తుందట..
ABN , First Publish Date - 2021-12-17T21:53:07+05:30 IST
అమెరికాలో ఓ యువతి తన ఖరీదైన బంగళాలోని కిచెన్‌లో ఎవరికీ అనుమానం రాకుండా చిన్న అల్మారా నుంచి మరో రెండు గదులకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయించుకుంది...
డబ్బులున్న వారు చాలా ఖర్చు చేసి.. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం చూస్తుంటాం. వారి వారి అభిరుచికి తగ్గట్టు జీవితాన్ని గడుపుతుంటారు. ఇక వారి ఇళ్ల విషయానికొస్తే.. సామాన్యులు కలలో కూడా ఊహించని విధంగా భారీగా ఖర్చు చేసి భవంతులను నిర్మించుకుంటూ ఉంటారు. బయటికెళ్లే పని లేకుండా అందులోనే సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అమెరికాలో ఓ యువతి కూడా తన అభిరుచికి తగ్గట్టుగా తన ఇంటిని నిర్మించుకుంది. ఖరీదైన బంగళాలోని కిచెన్‌లో ఎవరికీ అనుమానం రాకుండా చిన్న అల్మారా నుంచి మరో రెండు గదులకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయించుకుంది. తనకు మనసు బాలేనప్పుడల్లా అందులోకి వెళ్లి రిలాక్స్ అవుతుందట. అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
అమెరికాకు చెందిన ఓ యువతి తన తన బంగళాను ఎంతో ఖర్చు చేసి, తనకు అభిరుచికి తగ్గట్టుగా నిర్మించుకుంది. అంతటితో ఆగకుండా లోపల కిచెన్ నుంచి సీక్రెట్ మార్గాన్ని ఏర్పాటు చేయించుకుంది. పైకి ఎవరికీ అనుమానం రాకుండా ఓ చిన్న అల్మారా నుంచి మరో రెండు గదులకు ప్రత్యేక మార్గం ఉంటుంది. అందులో సకల సౌకర్యాలు ఉండేలా చూసుకుంది. కిచెన్ నుంచి వెళ్తే ముందుగా ఓ గది వస్తుంది. తర్వాత అక్కడి నుంచి మరో తలుపు గుండా లోపలికి వెళ్తే.. విశాలమైన గది ఉంటుంది. అందులో మినీ థియేటర్, పబ్ తదితర ఏర్పాట్లు ఉంటాయి.
బాత్రూమ్‌లో మరమ్మతు పనులు చేస్తున్న ప్లంబర్.. గోడలో ఏదో ఉన్నట్లు అనుమానం.. తీరా బద్దలు కొట్టి చూడగా..
మనసు బాగోలేనప్పుడు లోపల ఉన్న పబ్‌లో స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతానని ఆ యువతి చెబుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆమె తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. డబ్బులున్న వారు ఎన్ని ఏర్పాట్లయినా చేసుకుంటారు అని కొందరు కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ యువతి తన లైఫ్‌ని చాలా జాలీగా ఎంజాయ్ చేస్తోందంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.