Three Capitals : YS Jagan కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారా..!?

ABN , First Publish Date - 2021-11-22T18:32:02+05:30 IST

మూడు రాజధానుల బిల్లలు ఉప సంహరణ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Three Capitals : YS Jagan కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారా..!?

అమరాతి : మూడు రాజధానుల బిల్లలు ఉప సంహరణ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విస్ట్ ఇవ్వబోతున్నారా..? ఇంత సడన్‌గా బిల్లులు ఎందుకు వెనక్కి తీసుకున్నారు..? కొత్తగా బిల్లులు ప్రవేశపెడతారా..? ఒక వేళ అదే నిజమైతే ఆ బిల్లుల్లో ఏముంటుంది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే జగన్ తీసుకునే ఈ నిర్ణయంపై ప్రజలంతా నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.


ఏం ప్రకటిస్తారో..!?

కొద్దిసేపటి క్రితం మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఏపీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. అయితే.. త్రీ క్యాపిట‌ల్స్ చ‌ట్టం ర‌ద్దు త‌రువాత సీఎం ఏం చేస్తారనేదానిపై రాష్ట్ర ప్రజలతో పాటు.. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల్లో సర్వత్రా ఉత్కంఠ‌ నెలకొంది. అయితే.. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచుతారా? లేకుంటే కొత్తగా ఏం ప్రతిపాదిస్తారు..? అనే అంశంపై ఇప్పుడు చ‌ర్చ జరుగుతోంది. ఒకే రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ ఇన్ని రోజులుగా రాజధాని రైతులు తిరుగులేని పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు.. త‌నపై క‌క్షతో అమ‌రావ‌తిని చంపొద్దంటూ అనేకసార్లు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విన్నవించుకున్నారు కూడా. చివరికి ఎలాంటి కుట్రలు లేకుండా అమ‌రావ‌తే రాజ‌ధాని అని ప్రక‌టించాల‌ని అన్ని వ‌ర్గాల డిమాండ్ చేశాయి.


ఆ ట్విస్ట్ ఏంటో..!

అయితే.. ఈ ఉపసంహరణ తర్వాత జగన్‌ ఎలాంటి స్టాండ్‌ తీసుకోబోతున్నారు..? 3 రాజధానుల బిల్లును ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు..? ఉపసంహరణ తర్వాత కొత్తగా ఏమైనా ట్విస్ట్‌ ఉంటుందా..? అది అందరూ ఊహించినదేనా..? లేకుంటే ఎవరి ఊహకూ అందనిదా..? పాత సీఆర్డీఏ మళ్లీ అమల్లోకి రాబోతోందా..? అమరావతే ఏపీ రాజధానిగా విరాజిల్లనుందా..? లేదే మరేదైనా కీలక నిర్ణయం తీసుకోనున్నారా..? అనేదానిపై మరికొన్ని నిమిషాల్లో అసెంబ్లీ వేదికగా క్లారిటీ రాబోతోంది. అయితే.. కొత్త బిల్లును మాత్రం మరికాసేపట్లో వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బిల్లులో ఏముందో.. ఏంటో..!. ఇదిలా ఉంటే.. న్యాయ చిక్కులు, టెక్నికల్‌గా 3 రాజధానులు అనే పేరు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ, పూర్తి స్థాయి రాజధానిగా అమరావతా.. లేదా విశాఖను ప్రకటిస్తారో.. ఆ ట్విస్ట్ ఏంటో మరికాసేపట్లో క్లారిటీ వచ్చేయనుంది.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-11-22T18:32:02+05:30 IST