‘‘నా భర్త కిందపడిపోయాడు.. కాపాడండి’’ అంటూ కేకలు.. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన యువకుడు.. పోలీసుల విచారణలో ఏం తెలిసిందంటే..

ABN , First Publish Date - 2022-03-11T22:55:48+05:30 IST

రాజస్థాన్‌లో ఇటీవల ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. నా భర్త కిందపడిపోయాడు.. కాపాడండి.. అంటూ ఓ మహిళ కేకలు పెట్టింది. అప్పుడే ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. చివరకు పోలీసుల విచారణలో..

‘‘నా భర్త కిందపడిపోయాడు.. కాపాడండి’’ అంటూ కేకలు.. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన యువకుడు.. పోలీసుల విచారణలో ఏం తెలిసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని నిజ జీవిత కథలు.. సినిమా సీన్లను తలదన్నేలా ఉంటాయి. ఇటీవల జరుగుతోన్న కొన్ని ఘటనలు.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. చివరికి అసలు విషయం తెలుసుకుని.. వామ్మో! అని అంతా అవాక్కవుతున్నారు. కొన్ని నేరాలు జరిగినప్పుడు విచారణలో ముందు ఒకటి తెలిస్తే.. చివరకు అసలు నిజం వేరే ఉంటుంది. కొందరైతే ఎన్ని నేరాలు చేసినా.. పైకి మాత్రం అమాయకుల్లా కనిపిస్తుంటారు. తమకేమీ తెలీనట్లు నటిస్తుంటారు. రాజస్థాన్‌లో ఇటీవల ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. నా భర్త కిందపడిపోయాడు.. కాపాడండి.. అంటూ ఓ మహిళ కేకలు పెట్టింది. అప్పుడే ఓ యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటికి తెలియడంతో అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా బనేతా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామ సమీపంలో గల రోడ్డు పక్కన ఓ వ్యక్తి కిందపడి అపస్మారక స్థితిలో ఉన్నాడు. పక్కనే బైకు కూడా కిందపడి ఉంది. పొద్దునే ఓ మహిళ అటుగా వెళ్తూ కిందపడ్డ వ్యక్తిని చూసి షాక్ అయింది. ‘‘అయ్యో! నా భర్త కిందపడిపోయాడు.. ఎవరైనా వచ్చి కాపాడండి’’ అంటూ కేకలు వేసింది. అప్పుడే అటుగా వెళ్తున్న ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు సమాచారం ఇవ్వడంతో ఇంకొందరు స్థానికులు అక్కడికి వచ్చారు. అంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసుల పరిశీలనలో అతడు చనిపోయినట్లుగా తెలిసింది. మృతుడి భార్యను, తర్వాత సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువకుడిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బస్సు రన్నింగ్‌లో ఉండగా.. సడన్‌గా స్పృహ తప్పిన డ్రైవర్.. అంతా భయాందోళనలో ఉండగా ఓ మహిళ పైకి లేచి..


టోంక్ జిల్లా బనేతా సమీప ప్రాంతానికి చెందిన బాయి దేవి, లక్ష్మణ్ జాట్ దంపతులు. పెళ్లయిన కొన్నాళ్లకు వీరి సంసారంలో సమస్యలు తలెత్తాయి. స్థానిక కాలనీకి చెందిన రాంప్రసాద్ జాట్ అనే వ్యక్తి బాయిదేవికి పరిచయమయ్యాడు. సన్నిహితంగా మాట్లాడుతూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. లక్ష్మణ్‌కు తెలీకుండా తరచూ కలుసుకునేవారు. అయితే పెళ్లి చేసుకుని కలిసుండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం లక్ష్మణ్‌ను అడ్డు తొలగించుకోవాలని కుట్ర పన్నారు. ఎవరికీ డౌట్ రాకుండా చంపేయాలని పక్కా స్కెచ్ వేశారు. ఓ రోజు రాత్రి లక్ష్మణ్ నిద్రపోతుండగా రాయితో కొట్టి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని వారి పొలానికి వెళ్లే దారి పక్కనే పడేశారు.

నడుచుకుంటూ వెళ్తున్న యువతిని వెంబడించిన యువకులు.. ఎవరూ లేని సమయం చూసి.. చివరకు..


రాత్రి వేళ పొలానికి వెళ్తూ ప్రమాదం జరిగి.. చనిపోయాడని నమ్మించాలనేది వారి ప్లాన్. అనుకున్న ప్రకారమే మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి.. ఇద్దరూ కలిసి యాక్షన్ స్టార్ట్ చేశారు. అయితే బైక్ పడిపోయిన విధానం, లక్ష్మణ్‌కు తగిలిన దెబ్బలు చూసి పోలీసులకు అనుమానం కలిగింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారించగా.. చివరకు నిజాన్ని ఒప్పుకొన్నారు. దీంతో బాయి దేవి, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన బాయి దేవి ఉదంతం.. స్థానికంగా సంచలనం కలిగించింది.

‘‘ఇంకోసారి ఇలా చేయను సార్.. ఇదొక్కసారి వదిలేయండి’’.. అంటూ వేడుకున్న యువతి.. అసలేం జరిగిందంటే..

Updated Date - 2022-03-11T22:55:48+05:30 IST