ఈ గేదెను చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు.. తాబేలుకు ఆ గేదె ఎలా సాయం చేసిందో చూస్తే ఆశ్యర్యపోతారు..
ABN , First Publish Date - 2021-12-19T01:46:19+05:30 IST
ఎన్నో జంతువులు సాటి జంతువులకు సాయం చేయడం చూస్తుంటాం. ప్రస్తుతం ఓ గేదె కూడా అందుకు సాక్షంగా నిలుస్తోంది. తన కంటే ఎంతో చిన్నదైన తాబేలుకు ఎలా సాయం చేసిందో చూస్తే.. ఆశ్చర్యపోతారు..
ప్రస్తుత సమాజంలో మనుషులు స్వార్థపూరితంగా తయారయ్యారు. సాటి మనుషుల పట్ల అభిమానం చూపించడం పక్కనపెట్టి.. మోసాలు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. మానవత్వం చూపిండంలో ఒక్కోసారి మనుషుల కంటే జంతువులే నయం అనిపిస్తూ ఉంటుంది. సాటి జంతువుల పట్ల అవి చూపించేంత ప్రేమాభిమానాలు.. మనుషుల్లో మచ్చుకైనా కనబడవు. అందుకే అప్పుడప్పుడూ కొందరిని చూసినప్పుడు.. మీకంటే జంతువులు నయం అని అంటూ ఉంటారు. ఎన్నో జంతువులు సాటి జంతువులకు సాయం చేయడం చూస్తుంటాం. ప్రస్తుతం ఓ గేదె కూడా అందుకు సాక్షంగా నిలుస్తోంది. తన కంటే ఎంతో చిన్నదైన తాబేలుకు ఎలా సాయం చేసిందో చూస్తే.. ఆశ్చర్యపోతారు..
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. మనుషుల్లో అంతరించిపోతున్న మానవత్వాన్ని.. చాలా సార్లు జంతువుల్లో చూస్తుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ గేదె తనకంటే చాలా చిన్నదైన తాబేలుకు ఎంతో కష్టపడి సాయం చేస్తుంది. ఓ చెట్టు కింద తాబేలు వెల్లకిలా పడి ఉంటుంది. అక్కడి నుంచి వెళ్లేందుకు అది ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ సాధ్యం కాక సతమతమవుతూ ఉంటుంది. ఈలోగా ఓ గేదె దాన్ని గమనిస్తుంది. అంతటితో ఆగిపోకుండా, తాబేలు దగ్గరికి వచ్చి.. దాని సరైన స్థితికి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.
ఏనుగులు కూడా కామెడీ చేస్తాయా.. ఈ మహిళను ఏనుగు ఎలా ఆట పట్టిస్తుందో మీరే చూడండి..
తొలుత విఫలమైనా పట్టు వదలకుండా, తాబేలుకు ఎలాంటి గాయం కాకుండా.. కొమ్ములతో సుతిమెత్తగా పైకి తిప్పుతుంది. దీంతో ఆ తాబేలు అక్కడి నుంచి క్షేమంగా వెళ్లడం మనం చూడొచ్చు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా మనుషుల కంటే ఈ గేదె ఎంతో నయం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే.. మనకెందుకులే అని అనుకునే మనుషులు.. ఈ గేదెను చూసి నేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు.