Share News

Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?

ABN , Publish Date - May 02 , 2024 | 03:38 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...

Big Breaking: అనంతపురంలో 2వేల కోట్ల నగదు పట్టివేత.. 4 కంటైనర్ల కథేంటి..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది.


ఇదీ అసలు సంగతి..!

అనంత జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి గ్రామం వద్ద 2 వేల కోట్ల నగదుతో (2 Thousand Crores) వెళ్తున్న నాలుగు కంటైనర్లను పోలీసులు పట్టుకున్నారు. ఒక్కో కంటైనర్‌లో రూ. 500 కోట్ల చొప్పున నాలుగు కంటైనర్లలో మొత్తం రూ. 2వేల కోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్నికల కోడ్ కారణంలో పోలీసులు వాహనాలను తనీఖీలు చేస్తుండగా.. ఈ కంటైనర్లు చెక్ చేయడంతో బయటపడింది. అయితే.. ఇదంతా రిజర్వ్ బ్యాంక్‌కు (RBI) చెందిన నగదుగా పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఈ నాలుగు వాహనాలకు ఎస్కార్ట్‌గా కర్ణాటక పోలీసులు ఉన్నారు. అయితే.. కంటైనర్లలోని డబ్బును, రికార్డులను నిశితంగా పోలీసులు పరిశీలిస్తున్నారు.


2-Thousand-Crore-Cash.jpg

ఎవరిదీ నగదు..?

ఈ తనిఖీలకు సంబంధించి.. నగదు ఎవరిది..? ఆర్బీఐ డబ్బులేనా లేకుంటే మరేదైనా ఉందా..? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. నగదుకు సంబంధించిన రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో ఆ వాహనాలను పోలీసులు పంపించేశారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ నగదు మొత్తం ఆర్బీఐ కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ నగదుపై చిత్ర విచిత్రాలుగా సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తోంది.

Read latest AP News And Telugu News


Updated Date - May 02 , 2024 | 04:09 PM