Share News

YS Jagan: వైఎస్ సునీత వైద్యం.. జగన్‌కు బాగానే పనిచేసిందే..!

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:22 AM

అసలు రాయి తగిలిందా లేక దండ గీసుకుందా అనేది తెలియదు. స్వల్ప గీరుడుకు స్పాట్‌లో ఇద్దరు డాక్టర్లు, ఆస్పత్రిలో అరడజను మంది వైద్యులు చికిత్స చేశారు.

YS Jagan: వైఎస్ సునీత వైద్యం.. జగన్‌కు బాగానే పనిచేసిందే..!

  • 2 వారాల ‘గులకరాయి’ దెబ్బ పూర్తిగా పోయిందే?!

అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): అసలు రాయి తగిలిందా లేక దండ గీసుకుందా అనేది తెలియదు. స్వల్ప గీరుడుకు స్పాట్‌లో ఇద్దరు డాక్టర్లు, ఆస్పత్రిలో అరడజను మంది వైద్యులు చికిత్స చేశారు. అదే మనమైతే సెప్టిక్‌ కాకుండా అయింట్‌మెంట్‌ రాసుకుని వెళ్లిపోతాం. ఆయన జగన్‌ (YS Jagan Mohan Reddy).. పైగా ఎన్నికలు.. రెండు వారాలపాటు బ్యాండేజీతో సానుభూతి వర్షం కోసం ఎదురుచూశారు. కానీ, రివర్స్‌ అవుతుందని తీసేశారు. అదేం మాయో, రెండు వారాలు ‘బాధ’ పెట్టిన దెబ్బ పూర్తిగా మాయమైపోయింది. నిన్నటివరకు పెద్ద బ్యాండేజీతో తిరిగిన జగన్‌, శనివారం వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా చిన్న గాయం కూడా లేని మోముతో కనిపించడం ఒకింత ఆశ్చర్యపరిచింది. ఈ నెల 13న విజయవాడకు జగన్‌ బస్సు యాత్ర చేరుకున్న సమయంలో ‘గులకరాయి’ ఘటన జరిగింది. అప్పుడు కొన్ని రోజులు నుదిటికి చిన్న బ్యాండేజీతో ఆయన యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత నుంచి ఆ బ్యాండేజీ సైజు పెరుగుతూపోయింది.

ys-sunitha-7.jpg

ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆయన సోదరి, వివేకా కుమార్తె డాక్టరు సునీత మీడియా వేదికగా జగన్‌కు ఒక సూచన చేశారు. బ్యాండేజీ ఎక్కువకాలం వాడితే సెప్టిక్‌ అవుతుందని .. ఒక డాక్టరుగా ఈ మాట చెబుతున్నానన్నారు. ఆమె సూచ న జగన్‌పై బాగానే ప్రభావం చూపినట్టు కనిపిస్తోంది. ఆమె ‘వైద్యం’ తమ అధినేతపై బాగానే పనిచేసినట్టు ఉందని జగ న్‌ పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. అయితే.. సునీ త సూచనపై నోరుజారిన మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం ఆటలో అరటిపండుగా మారారు. వైద్యుల సలహా మేరకే జగన్‌ ప్లాస్టర్‌ పెట్టుకున్నారనీ, సునీత టెలి మెడిసిన్‌ సలహాలు అవసరం లేదని బొత్స అన్నారు. కానీ, శనివారం ఎలాంటి గాయం జగన్‌ నుదిటిపై కనిపించలేదు. చానల్‌లో ఆయనను చూసినవారికి... జగన్‌ ముఖంలో ఏదో మిస్సయిందన్న భావన కలిగింది. అదేమిటో తెలుసుకునేందుకు, ఒక నిమిషం పట్టింది. ఆపై... ‘అరే పోయిందే..’ అని ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది.

Updated Date - Apr 28 , 2024 | 10:00 AM