Share News

AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు గాయం.. జనసేన నేతల ఆందోళన

ABN , Publish Date - May 07 , 2024 | 07:31 PM

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ జనసేనాని ప్రచారంలో దూసుకెళ్తునే ఉన్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.

AP Elections 2024: పవన్ కళ్యాణ్‌కు  గాయం.. జనసేన నేతల ఆందోళన
Pawan Kalyan

అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏపీలో రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నప్పటికీ జనసేనాని ప్రచారంలో దూసుకెళ్తునే ఉన్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు.

నిన్న(సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో విశ్రాంతి లేకుండా పవన్ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అయితే అభిమానులు సెల్పీలు దిగే సమయంలో పవన్ కళ్యాణ్ కాలి బొటన వేలికి గాయం అయినట్లు తెలుస్తోంది.


నిన్న(సోమవారం) రేణిగుంట విమానాశ్రయానికి కాలికి కట్టుతో పాటే పవన్ వచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిన్న అనకాపల్లి ఎన్నికల ప్రచార సభలోనే జనసేనాని కాలికి గాయం అయినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు జనసేన అభిమానులు, కూటమి నాయకులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలోనే కాలి వేలికి గాయం అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధాని నరేంద్రమోదీ సభ కావడంతో పవన్ వ్యక్తిగత భద్రత సిబ్బందిలేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. కాలి వేలికి కట్టుతోనే నేడు తిరుపతిలో‌ టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేనాని కాలికి గాయం కావడంతో కూటమి నేతలు, ఆయన వీరాభిమానులు ఆందోళన చెందుతున్నారు.


ఇవి కూడా చదవండి

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

ఏపీలో పెను సంచలనం.. దుమారం రేపుతున్న తాజా సర్వే.. సోషల్ మీడియాలో వైరల్..!

AP Elections: బాబోయ్.. పేర్ని నాని అవినీతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 07:45 PM