Share News

AP Elections 2024: జనసేన నేత ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతల దాడి

ABN , Publish Date - Apr 27 , 2024 | 08:52 PM

తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.

AP Elections 2024: జనసేన నేత ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నేతల దాడి
Aranii Srenevasulu

తిరుపతి: తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన బీజేపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. పలువురు ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈసీ అనుమతులతో ప్రచారం నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు తమపై దాడి చేశారని ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.


AP Elections: కొత్త స్కీం లేదు.. మెరుపులు లేవు.. తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు. కార్యకర్తలపై దాడి చేయడం సరికాదని చెప్పారు. ఇదేవిధంగా దాడులు ప్రోత్సహిస్తే తగిన మూల్యం వైసీపీ చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అనైతిక చర్యలను కూటమి పార్టీలు సమర్థంగా ఎదుర్కొంటాయన్నారు. తిరుపతిలో ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ చెడగొట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. పోలీసులు, ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.


AP Elections 2024: రాజధానిపై జగన్ నిర్ణయం ఇదే.. అమరావతిపై మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే!

ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ఏపీలో విధ్వంసకాండ సృష్టించారని ఆరణి శ్రీనివాసులు అన్నారు. రూ.13లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు.సంక్షేమం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారని మండిపడ్డారు. గుంతలు కూడా పూడ్చలేని స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు.


AP Elections: సిగ్గు, సంస్కారం వదిలేశారు.. జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్..

ఏపీలో ఎలాంటి అభివృద్ధి చేశారో జగన్ చెప్పగలరా..? అని ప్రశ్నించారు. కాపు, బలిజ, తెలగ కులస్తులు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు కచ్చితంగా బుద్థి చెబుతారని వార్నింగ్ ఇచ్చారు. తిరుపతిలో రాజారెడ్డి పాలనను కొనసాగించారని విమర్శించారు. తిరుమల పవిత్రత దెబ్బ తీసే విధంగా జగన్ వ్యవహరించారని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆరణి శ్రీనివాసులు అభ్యర్థించారు.


AP Elections: వైసీపీ మేనిఫెస్టో: నాడు - నేడు

రూ. 8లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచేశారు: సుగుణమ్మ

జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం విధ్వంసమేనని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. ఎన్డీఏ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. విశ్వసనీయత, నైతికత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. వైసీపీ అరాచక పాలన అంతం.. కూటమితోనే సాధ్యమన్నారు. జగన్ చేతకాని పాలన..చంద్రబాబు సమర్థవంతమైన పాలనను ప్రజలకు వివరిస్తామని చెప్పుకొచ్చారు. రూ. 8లక్షల కోట్ల ప్రజాధనాన్ని జగన్ దోచేశారని సుగుణమ్మ మండిపడ్డారు.

Chandrababu: నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో జగన్ పీహెచ్డీ చేశారు

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 27 , 2024 | 08:58 PM