AP News: పరిటాల శ్రీరామ్‌ను కలిస్తే ఫినిష్ చేస్తా..సీఐ అరాచకం
ABN , First Publish Date - 2022-11-11T09:09:21+05:30 IST
ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ను కలిస్తే ఫినిష్ చేస్తానంటూ ధర్మవరం టూ టౌన్ సీఐ రాజా అరాచకంగా ప్రవర్తించాడు.
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ (Paritala sriram) ను కలిస్తే ఫినిష్ చేస్తానంటూ ధర్మవరం టూ టౌన్ సీఐ రాజా అరాచకంగా ప్రవర్తించాడు. టీడీపీ కార్యకర్తలను బెల్టు, లాఠీతో చితకబాదాడు. అసలేం జరిగిందంటే... ఓ కేసు విషయంలో సీఐ పిలుస్తున్నారంటూ ధర్మవరం 37వ వార్డ్ రామ్ నగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు హరీష్, మంజు, చంద్రశేఖర్, వెంకటేష్, సూరి, వెంకటరాముడులను సీఐ రాజా విచక్షణారహితంగా చితకబాదాడు. పరిటాల శ్రీరామ్‌తో ఫోటో దిగితే చితకబాదుతారా అంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా... లాఠీ దెబ్బలతో తీవ్ర గాయాల పాలైన హరీష్, మంజులను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తీరు పట్ల టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.