Butchaiah Chowdary: వైసీపీ నేతల అవినీతి పరాకాష్టకి చేరింది
ABN , First Publish Date - 2022-12-13T16:00:58+05:30 IST
రాజమండ్రిలో వైసీపీ నేతల అవినీతి పరాకాష్టకి చేరిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(TDP MLA Gorantla Butchaiah Chowdary) ఆరోపించారు. ఆయన మీడియాతో
రాజమండ్రి: రాజమండ్రిలో వైసీపీ నేతల అవినీతి పరాకాష్టకి చేరిందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(TDP MLA Gorantla Butchaiah Chowdary) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలు వద్దని చెప్పినా కూడా ఇళ్ల మధ్యలో కలెక్టర్ సారధ్యంలో ఎంపీ మార్గాని భరత్(MP Margani Bharat) ఇసుక ర్యాంపులు తెరుస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అవినీతి తారాస్థాయికి చేరినా కలెక్టర్ స్పందించటం లేదు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి లాక్కొని వైసీపీ కార్యకర్తలకు పంచుకుంటున్నారు. దళిత యువకుడ్ని హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు(YCP MLC Anantha Babu)ను కాపాడుతున్న ముఖ్యమంత్రి జగనే(Cm jagan) తొలి ముద్దాయి. అనంతబాబు బయటకు వస్తే దళిత యువకుడు కుటుంబానికి ప్రాణహాని ఉంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఏడు రోజుల్లో ఉరిశిక్ష వేస్తామని దుర్మార్గుడు జగన్ దిశ చట్టం ప్రవేశపెట్టాడు. దిశ చట్టం ఏపీలో ఎక్కడైనా అమలవుతుందా? పేపర్ మిల్లుని మూసివేసేందుకు ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వీధి పోరాటాలు చేస్తున్నారు. కంబాల చెరువు పార్కు అబివృద్ధి పేరుతో కార్పోరేషన్ నిధులు దోచుకుంటున్నారు. ఎంపీ మార్గాని భరత్ ప్రచార పిచ్చితో రాజమండ్రిలో అవినీతి తారాస్థాయికి చేరింది. ఘన చరిత్ర ఉన్న ఆర్యాపురం కో ఆపరేటివ్ బ్యాంకును వైసీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారు.’’ అని బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు.