AP High Court: మంత్రి విడదల రజినికి నోటీసులు
ABN , First Publish Date - 2022-12-27T16:05:07+05:30 IST
మంత్రి విడదల రజిని (Minister Vidadala Rajini)కి హైకోర్టు నోటీసులు (AP High Court) జారీ చేసింది. చిలకలూరిపేట
పల్నాడు: మంత్రి విడదల రజిని (Minister Vidadala Rajini)కి హైకోర్టు నోటీసులు (AP High Court) జారీ చేసింది. చిలకలూరిపేట మండలం మురికిపూడిలో అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇవ్వడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడంపై అసైన్డ్ రైతులు (Farmers) అభ్యంతరం తెలిపారు. అసైన్డ్ రైతులను బెదిరించి చట్టవిరుద్ధంగా ఎన్‌వోసీ ఇచ్చారని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) మామ ప్రతాపరెడ్డి, తహశీల్దారు, సీఐ, ఎస్సైలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పిటిషన్లపై కోర్టు తుది నిర్ణయానికి లోబడి లీజు ఖరారు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు కోర్టు వాయిదా వేసింది.