Pullarao: మంత్రి విడదల రజిని అరాచకాలు ఎక్కువయ్యాయి

ABN , First Publish Date - 2022-12-28T16:11:44+05:30 IST

చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని (Vidadala rajini) అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) ఆరోపించారు.

Pullarao: మంత్రి విడదల రజిని అరాచకాలు ఎక్కువయ్యాయి
అరాచకాలు ఎక్కువయ్యాయి

పల్నాడు: చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని (Vidadala rajini) అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రి పదవి వచ్చిన తర్వాత భూ దోపిడీలకు పాల్పడుతోంది. సొంత పార్టీ(ycp) వాళ్ల నుంచే పొలాలు లాగేసుకుంటుంది. ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యుల పేర్లు తెరపైకి తెస్తోంది. దళితుల భూములు లాక్కోని మైనింగ్‌కు కట్టబెడుతుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో చిలకలూరిపేటలో అరాచకాలు. యడవల్లి దళిత భూముల పరిహారంలో కమిషన్‌లు వసూలు చేశారు. మురికిపూడి భూముల విషయంలో సొంత పార్టీ వాళ్లే కోర్టుకు వెళ్లారు. మురికిపూడి బాధితులకు టీడీపీ(tdp) అండగా ఉంటుంది.’’ అని పుల్లారావు భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-12-28T16:11:45+05:30 IST