AP News: వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు: గిడుగు రుద్రరాజు
ABN , First Publish Date - 2022-12-01T13:05:03+05:30 IST
ఢిల్లీ: వైసీపీ (YCP) పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) అన్నారు.
ఢిల్లీ: వైసీపీ (YCP) పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ (Congress) దెబ్బతిందన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసి.. ప్రజలు కాంగ్రెస్ వస్తేనే మంచిదని భావిస్తున్నారన్నారు. ఈనెల 9న ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానన్నారు. కాంగ్రెస్ అనేక సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. ఏపీ రాజధాని అమరావతి (Amaravathi) నిర్మాణానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలో ‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’ పేరట కార్యక్రమం నిర్వహిస్తామని గిడుగు రుద్రరాజు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న సీనియర్ నేతలు అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్తామని గిడుగు రుద్రరాజు అన్నారు. తమ పోరాటం రాష్ట్రంలో వైసీపీ.. కేంద్రంలో బీజేపీపై అని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రంలో యువతకి ఉపాధి దొరుకుతుందన్నారు. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఏపీకి ఇచ్చే అంశంపై తొలి సంతకం చేస్తామన్నారని ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు గుర్తు చేశారు.