Macharla Issueపై టీడీపీ సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2022-12-17T15:07:34+05:30 IST
పల్నాడు జిల్లా మాచర్ల ఘటనపై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది.
అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల ఘటన (Macharla Issue) పై టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. మాచర్ల ఘటన ఉన్నత స్థాయిలో జరిగిన కుట్ర అని.. దాడుల వెనుక ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నారని ఆరోపణలు గుప్పించింది. ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యూహాన్ని స్థానిక పోలీసు అధికారులు అమలు చేశారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న మాచర్లలో జరిగింది ప్రభుత్వ ప్రేరేపితహింసగా ఆ పార్టీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఇంటెలిజెన్స్ చీఫ్, పల్నాడు ఎస్పీలను ఆ స్థానాల నుంచి బదిలీ చేయాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు.