Atchannaidu: కందుకూరు ఘటన చాలా బాధాకరం
ABN , First Publish Date - 2022-12-29T12:52:11+05:30 IST
కందుకూరు మృతులకు టీడీపీ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. మృతులకు టీడీపీ నేతలు నివాళులర్పించారు.
అమరావతి: కందుకూరు మృతులకు టీడీపీ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. మృతులకు టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీపీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) మాట్లాడుతూ... కందుకూరు ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ విషాదకర సంఘటనలో కూడా కొన్ని పిచ్చి కుక్కలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో పాటు.. ఇతర పార్టీలు కూడా స్పందించాయన్నారు. ప్రధాని మోదీ స్పందించారని.. నష్టపరిహారం ప్రకటించారని తెలిపారు. అందరూ స్పందించాక రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.