Atchannaidu: మీడియాను తిట్టాలన్న జగన్ ఆదేశంపై అచ్చెన్న ఏమన్నారంటే....

ABN , First Publish Date - 2022-12-28T12:00:44+05:30 IST

మీడియా కథనాలపై తిట్టాలంటూ కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇవ్వడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు.

 Atchannaidu: మీడియాను తిట్టాలన్న జగన్ ఆదేశంపై అచ్చెన్న ఏమన్నారంటే....

అమరావతి: మీడియా కథనాలపై తిట్టాలంటూ కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ (AP CM Jagan Mohan Reddy) ఆదేశాలు ఇవ్వడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP State President Atchannaidu) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కలెక్టర్లు ప్రెస్‌మీట్ పెట్టి జగన్ చెప్పే అబద్దాలను ఖండించాలన్నారు. జగన్ చెప్పినట్టే మీడియా సమావేశం పెట్టి జగన్ అబద్దాల కోరు అని చెప్పాలని అన్నారు. పెన్షన్ల విషయంలో అసలు వాస్తవాలను ప్రజలకు కలెక్టర్లు వివరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లు అసలు వాస్తవాలు చెబితేనే జగన్‌కు బుద్ది వస్తుందని వ్యాఖ్యానించారు. సంక్షేమం అనే పదం పుట్టిందే ఎన్టీఆర్ (NTR) వల్ల అని చెప్పారు. పెన్షన్.. పెన్షన్ అని జగన్ ఏదేదో మాట్లాడుతున్నారని.. పెన్షన్ విధానాన్ని పెట్టిందే ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.3 వేల చేస్తామని చెప్పి మాట తప్పారని అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.

Updated Date - 2022-12-28T12:01:15+05:30 IST