Kollu ravindra: గోడలు దూకింది పోలీసులా లేక వైసీపీ కార్యకర్తలా

ABN , First Publish Date - 2022-11-03T11:02:27+05:30 IST

ఈ దుర్మార్గపు జగన్ ప్రభుత్వ పోలీస్ దుశ్చర్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Kollu ravindra: గోడలు దూకింది పోలీసులా లేక వైసీపీ కార్యకర్తలా

మచిలీపట్నం: ఈ దుర్మార్గపు జగన్ ప్రభుత్వ పోలీస్ దుశ్చర్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu ravindra) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అక్రమాలను, అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు. గోడలు దూకింది పోలీసులా లేక వైసీపీ కార్యకర్తలా అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) కుటుంబంపై ఈ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan reddy) ముఠా కక్ష కట్టి వేధిస్తోందని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో A1, A2 విజయసాయిరెడ్డి (Vijayasai reddy) చేస్తున్నటువంటి భూదోపిడి గురించి అవినీతిని అక్రమాలను ప్రశ్నించినందుకు అర్థరాత్రి ఇలాంటి నీచపు చర్యలకు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు.

దీన్ని వదిలే ప్రసక్తే లేదు బీసీ నేతలపై కక్ష కట్టిన ఈ జగన్‌ (AP CM)కు పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. అరెస్టులకు భయపడేది లేదన్నారు. ఈ ప్రభుత్వ అరాచకాలను ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళతామని... అవసరమైతే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ ప్రభుత్వంపై ప్రజల తరుపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. వెంటనే అయ్యన్నపాత్రుడు, వారి కుమారుడిని వెంటనే విడుదల చేయాలని... లేదంటూ బీసీలంతా ఏకమై ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని కొల్లు రవీంద్ర (Former minister) హెచ్చరించారు.

Updated Date - 2022-11-03T11:02:28+05:30 IST