Payyavula keshav: మాచర్ల అవినీతికి అడ్డాగా మారింది
ABN , First Publish Date - 2022-12-17T09:03:12+05:30 IST
పిన్నెల్లి ఎమ్మెల్యే అయ్యాక పౌరుషాల పురిటిగడ్డ మాచర్ల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: పిన్నెల్లి ఎమ్మెల్యే అయ్యాక పౌరుషాల పురిటిగడ్డ మాచర్ల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (TDP MLA Payyavula keshav) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... రామకృష్ణారెడ్డి రంకెలేస్తే భయపడటానికి మాచర్లలో ఉంది జైలుపక్షి కాదు.. జూలకంటి బ్రహ్మారెడ్డి (Julakanti brahmananda Reddy) అని తెలిపారు. టీడీపీ కార్యకర్తలపై దాడిచేసి, పోలీసుల్ని అడ్డుపెట్టుకొని వారి ఆస్తులను ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేంఖర్మ- రాష్ట్రానికి కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని పిన్నెల్లి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఛీత్కారాలు, శాపనార్థాలు జీర్ణించుకోలేకనే జగన్ బినామీ పిన్నెల్లి, వైసీపీ రౌడీ మూకల్ని రెచ్చగొట్టి, మాచర్లను మంటల్లోకి నెట్టారని పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.