High Court: గన్నవరం రైతులకు కౌలు చెల్లించాలని ఆదేశం

ABN , First Publish Date - 2022-12-19T14:13:14+05:30 IST

గన్నవరం విమానాశ్రయ (Gannavaram Airport) విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపుపై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. తమకు ఐదు సంవత్సరాల

High Court: గన్నవరం రైతులకు కౌలు చెల్లించాలని ఆదేశం

అమరావతి: గన్నవరం విమానాశ్రయ (Gannavaram Airport) విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపుపై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. తమకు ఐదు సంవత్సరాల నుంచి కౌలు ఇవ్వడం లేదని గన్నవరం అన్నదాతలు(Farmers) హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణాజిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ కోర్టు విచారణకు హాజరయ్యారు. రైతుల తరపున న్యాయవాది వివి. లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. వెంటనే కౌలు చెల్లిస్తామని అధికారులు న్యాయస్థానానికి తెలియజేశారు. రెండు వారాల్లోపు కౌలు చెల్లించాలని ధర్మాసానం ఆదేశించింది. వచ్చేనెల 6వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. ఆ రోజులోపు చెల్లించకపోతే మళ్లీ కోర్టుకు హాజరుకావాలని అధికారులకు ఆదేశించింది. చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని హైకోర్టు హెచ్చరించింది.

Updated Date - 2022-12-19T14:15:43+05:30 IST