Buggana: కర్నూలులో హైకోర్టు చంద్రబాబుకు ఇష్టం ఉందా?.. లేదా?
ABN , First Publish Date - 2022-12-05T13:30:38+05:30 IST
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.
కర్నూలు: కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబు(TDP Chief Chandrababu naidu)కు ఇష్టం ఉందా లేదా చెప్పాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (AP Minister buggana rajendranath reddy) డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కరువు కారణంగా కాళేబరాలు కూడా పూడ్చిపెట్టిన ప్రాంతం రాయలసీమ అని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. మేధావులు అధ్యయనం చేసి సూచించిన మేరకు మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు.