Kandukuru Incident: చంద్రబాబుపై కేఏ పాల్ ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-12-29T16:00:02+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫిర్యాదు చేశారు.

Kandukuru Incident: చంద్రబాబుపై కేఏ పాల్ ఫిర్యాదు

నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫిర్యాదు చేశారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు బుధవారం నెల్లూరు జిల్లా (Nellore District) కందుకూరులో నిర్వహించిన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎనిమిది మంది మృతి చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కందుకూరు (Kandukuru) పోలీస్ స్టేషన్‌లో కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఇరుకు రోడ్డులో చంద్రబాబు సభ పెట్టారని ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనను చంద్రబాబు కందుకూరు నుంచి మొదలుపెట్టారు. నిన్న సాయంత్రం కందుకూరులో ఎన్టీఆర్‌ సర్కిల్‌ (NTR Circle) వద్ద బహిరంగ సభ చేశారు. అప్పటికే వేలాదిమంది అక్కడ గుమికూడారు. నిలబడటానికి కూడా స్థలం లేనంతగా జనం కిక్కిరిశారు. ఒకరిమీద మరొకరు పడటంతో కింద ఉన్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ హఠాత్పరిమాణంతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా భయాందోళనకు గురై అటూఇటూ పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాటలో కొందరు, కాలువలో పడిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు.

మృతులు వీరే!

1. కాకుమాని రాజా (50), కందుకూరు

2. కలవకూరి యానాది (65), కొండముడుసుపాలెం

3. దేవినేని రవీంద్రబాబు (73), ఉలవపాడు, ఆత్మకూరు మండలం

4. యాటగిరి విజయ (35), ఉలవపాడు

5. ఉచ్చులూరి పురుషోత్తం (56), గుడ్లూరు మండలం గుళ్లపాలెం

6. మర్లపాటి చినకొండయ్య (55), అమ్మవారిపాలెం

7. గడ్డం మధుబాబు (45), ఓగూరు, కందూకురు మండలం

8. రాజేశ్వరి (40), కందుకూరు

Updated Date - 2022-12-29T16:02:02+05:30 IST