Purandheswari: ప్రత్యేక హోదాపై పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-12-08T11:52:15+05:30 IST

ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.

Purandheswari: ప్రత్యేక హోదాపై పురంధేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రకాశం: ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status)పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి (BJP National General Secretary Daggubati Purandheswari) ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేద (There is no possibility of giving special status to any state)ని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు ఇచ్చే ఆదాయాన్ని గతంలో 32 శాతం ఇచ్చేవారని.. ప్రస్తుతం 42 శాతానికి కేంద్రం పెంచిందన్నారు. గతంలోనే ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి సీఎం అంగీకరించారని అన్నారు. ఏపీకి ప్రస్తుతం కేంద్రం నుంచి వస్తున్న వనరులు తప్పుదోవ పడుతున్నాయని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో జేబులు నింపుకోకుండా ప్రజలకు ఉపయోగించాలని బీజేపీ నేత సూచించారు.

లిక్కర్ స్కాం (Delhi Liquor scam) విషయంలో ఈడీ తన పని తాను చేసుకుంటుందన్నారు. ప్రజల ఆదరాభిమనాలు కొనసాగుతున్నాయని.. అందుకే గుజరాత్‌లో మరోసారి ప్రజలు బీజేపీని ఆశీర్వదించారని తెలిపారు. బీసీలకు న్యాయం చేశామంటున్న ఏపీ ప్రభుత్వం (AP Government) శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులాలను విభజించు.. పాలించు అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. లిక్కర్ స్కాం వ్యవహారం నుంచి ప్రజలను దారి మళ్లించేందుకే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) షర్మిలను అడ్డుకున్నట్లుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో మహిళలు పట్ల తెలంగాణ ప్రభుత్వం చులకనభాదంతో ఉందని భావిస్తున్నామని పురంధేశ్వరి (BJP Leader) పేర్కొన్నారు.

Updated Date - 2022-12-08T11:52:17+05:30 IST