Dharmana prasad Rao: విశాఖ రాజధాని అవకాశం ఇప్పుడు పోతే మళ్లీ రాదు
ABN , First Publish Date - 2022-10-31T14:44:06+05:30 IST
రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖలో ఉన్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
శ్రీకాకుళం: రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖలో ఉన్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana prasad rao) అన్నారు. సోమవారం జిల్లాలో జరిగిన మన రాజధాని - మన విశాఖ సదస్సులో మంత్రి మాట్లాడుతూ... పెద్ద రాజధాని వద్దని శివరామకృష్ణ కమిటీ సలహా ఇచ్చిందని తెలిపారు. పరిస్థితులను బట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని గతంలోనే డిమాండ్ వచ్చిందన్నారు. అభివృద్ధిలో అసమానత ఉంటే అస్థిరత ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధాని కోసం రహస్యంగా 3500 జీవోలు ఇచ్చారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రజల్లో సీరియస్ నెస్ పెంచేందుకే రాజీనామా అన్నానని తెలిపారు. విశాఖ రాజధాని అవకాశం ఇప్పుడు పోతే మళ్లీ రాదని... నివేదికలు, నిపుణులు చెప్పినట్లే సీఎం జగన్ (YS jagan mohan reddy)చేస్తున్నారని అన్నారు. ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు ఏం స్టడీ చేశాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోకవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు (AP Minister) పేర్కొన్నారు.