Home » Dharmana Prasada Rao
ఎన్నికల ముందు మాదే అధికారం అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ నాయకుల ఆచూకీ కనబడటం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందనే చర్చ జరుగుతోంది. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో లేరట.
సౌమ్యులు, వివాదరహితులు, పార్టీకి నిబద్ధులుగా పనిచేసినవారు, మృదుస్వభావులుగా పేరున్న నేతలు సైతం వైసీపీని వీడిపోతున్నారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయం పాలైనా తమ అధినేత జగన్మోహన్రెడ్డి తీరులో మార్పు రాకపోవడం.. ఆయన నిరంకుశ వైఖరిని తట్టుకోలేక దండం పెట్టి మరీ వెళ్లిపోతున్నారు...
శ్రీకాకుళం జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే రాజకీయ నాయకులు కొందరు ఉంటారు. ప్రస్తుత రాజకీయాల్లో మొదట వరుసలో ఉండేది కింజరాపు కుటుంబమైతే.. రెండో వరుసలో ఉండేది ధర్మాన కుటుంబం.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) కీలకఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ అభ్యర్థుల్లో టెన్షన్ సాధారణమే. కానీ గత ఎన్ని కల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో మాత్రం మరింత టెన్షన్ కనిపిస్తోంది. ఇందులో ప్రస్తుత శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ముందువరుసలో ఉన్నారు..
మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ మన పార్టీ గుర్తు తెలియటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేట ప్రచారంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశరాు. ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకే అంటున్నారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో బీసీలకు చేసింది సామాజిక న్యాయం కాదని.. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ధనవంతులనే రాజ్యసభకు పంపుతాడన్నారు.
AP Elections 2024: ‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ వైసీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపైనే మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లోనూ కలవరం రేపుతోంది.
నీతి అయోగ్ చూపించిన మోడల్ ప్రకారం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌ను ఏపీకి తీసుకొచ్చామని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు(Minister Dharmana Prasad Rao) తెలిపారు. వంశధార సూపరింటిండెంట్ ఇంజనీరు కార్యాలయంలో స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని శనివారం నాడు ఆవిష్కరించారు.
Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా తెలియనందున పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ( Minister Dharmana Prasada Rao ) తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. భూ వివాదాలు లేకుండా చేయాలనే ప్రభుత్వం ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తీసుకువస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.