Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయానికి గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2022-11-14T18:01:38+05:30 IST

దక్షిణ కోస్తా రైల్వేజోన్ (Railway Zone) కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యాలయానికి గ్రీన్‌సిగ్నల్
విశాఖపట్నం రైల్వేస్టేషన్

విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వేజోన్ (Railway Zone) కార్యాలయానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం (Visakhapatnam) రైల్వేస్టేషన్ రోడ్డులో రూ.106 కోట్లతో జోన్ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. తొలిదశలో పాత వైర్‌లెస్ కాలనీలో 13 ఎకరాల్లో జోన్ కోసం భూసేకరణ చేయనున్నారు. 8 ఎకరాల్లో మల్టీ స్టోరీడ్‌ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం కేంద్రం రూ.456 కోట్లను మంజూరు చేసింది. అదనంగా మరో రెండు రైల్వే ప్లాట్‌ఫామ్‌ల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపించింది.

Updated Date - 2022-11-14T18:32:31+05:30 IST