Minister Roja: త్వరలోనే వైజాగ్ పరిపాలన రాజధాని కాబోతోంది
ABN , First Publish Date - 2022-12-14T12:48:23+05:30 IST
త్వరలోనే వైజాగ్ పరిపాలన రాజధాని కాబోతోందని.. జగన్ మాట ఇస్తే తప్పరని మంత్రి ఆర్కే రోజా మరోసారి తేల్చిచెప్పారు.
విశాఖపట్నం: త్వరలోనే వైజాగ్ పరిపాలన రాజధాని కాబోతోందని.. జగన్ మాట ఇస్తే తప్పరని మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) మరోసారి తేల్చిచెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... అయితే ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేసి అవుతున్నారని అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే... మూడు రాజధానులు (Three capitals) అని తెలిపారు. శాసనసభలో, శాసనమండలిలో తమకు బలం ఉందన్నారు. ‘‘వికేంద్రీకరణ బిల్లును త్వరలోనే పెడతాం.. ఎప్పుడు పెడతామో మీరే చూస్తారు కదా?’’ అని అన్నారు. విశాఖ గర్జనను అడ్డుకోవడం కోసమే.. పవన్ (Janasena Chief Pawan Kalyan) ఆరోజు విశాఖలో జనవాణి పెట్టారన్నారు. జనవాణీ కార్యక్రమం ఎందుకు ఇపుడు పెట్టడం లేదని ప్రశ్నిస్తూ... పవన్‌కు షూటింగ్ గ్యాప్ లేదా? అని యెద్దేవా చేశారు. జగన్ ఎలా అయినా గద్దె దించాలని ప్రతిపక్షాలు చేస్తున్నాయన్నారు. వాలంటీర్, సచివాలయం వ్యవస్థలను తీసేస్తామన్న ప్రతిపక్షాలు... ఇప్పుడు ప్రజల నిరసనకు భయపడి కంటిన్యూ చేస్తామని అంటున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్‌ను ప్రజలు నమ్మరని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ (YCP)కి 175కి 175 స్థానాలు వస్తాయని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.