modi-jagan meet: రేపు ఉదయం ప్రధానితో గవర్నర్‌, సీఎం జగన్ భేటీ

ABN , First Publish Date - 2022-11-11T20:33:20+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీతో శనివారం ఉదయం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్న ప్రధాని ఐఎన్‌ఎస్‌ చోళలో బస చేయగా...గవర్నర్‌ నోవాటెల్‌ హోటల్‌లో, సీఎం పోర్టు అతిథిగృహంలో బస చేశారు.

modi-jagan meet: రేపు ఉదయం ప్రధానితో గవర్నర్‌, సీఎం జగన్ భేటీ

విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీతో శనివారం ఉదయం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్న ప్రధాని ఐఎన్‌ఎస్‌ చోళలో బస చేయగా...గవర్నర్‌ నోవాటెల్‌ హోటల్‌లో, సీఎం పోర్టు అతిథిగృహంలో బస చేశారు. శనివారం ఉదయం గవర్నర్‌, ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన ఐఎన్‌ఎస్‌ చోళకు వెళ్లి ప్రధానితో సమావేశమవుతారు. తరువాత అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభావేదిక వద్దకు వస్తారు.

ఆదివారం ఉదయం 9.40 గంటలకు సీఎం ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలోని హెలిపాడ్‌ వద్దకు వస్తారు. చోళ గెస్ట్‌హౌస్‌ నుంచి ప్రధాని మోదీ నేవీ హెలికాప్టర్‌లో సభాస్థలికి 10.20 గంటలకు వస్తారు. అక్కడ ప్రధానికి జగన్‌ మళ్లీ స్వాగతం పలుకుతారు. 10.30 గంటల నుంచి 11.45 గంటల వరకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అది పూర్తికాగానే హెలికాప్టర్‌లో బయలుదేరి 12.20 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరతారు. అక్కడ సీఎం తదితరులు వీడ్కోలు పలుకుతారు. సీఎం జగన్‌ 12.45 గంటలకు విజయవాడ బయలుదేరి వెళ్లిపోతారు.

Updated Date - 2022-11-11T22:24:42+05:30 IST