Ayyannapatrudu: సజ్జల బుర్ర ఉండే మాట్లాడుతున్నారా?
ABN , First Publish Date - 2022-12-12T14:01:35+05:30 IST
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramkrishnudu) వ్యాఖ్యలపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (TDP Leader Ayyannapatrudu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రెండు రాష్ట్రాల కలయికపై సజ్జలకు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డికి అసలు ఏమి తెలుసని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి... ఇప్పుడు సజ్జల ఎలా కలుపుతారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ఉందని తెలిపారు. అందుకే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మెడలు వంచుతామని అన్నారు కదా... వైసీపీ నేతలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గత మూడేళ్ల నుంచి రైతులు అవస్ధలు పడుతున్నారు.. రైతులకు ఇదేమి ఖర్మ అని నిలదీశారు. రైతులకు జగన్ సర్కార్ 2 వేల కోట్ల బకాయి పడిందని... తిండి గింజలను మిల్లర్స్ కొనడం లేదన్నారు. పంటను బయట అమ్ముకోడానికి లేకుండా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. దొంగోడు పార్టీ తప్పా అన్ని పార్టీలు రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని అయ్యన్నపాత్రుడు అన్నారు.