Visakha Railway: విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయం కోసం రూ.106 కోట్లు

ABN , First Publish Date - 2022-11-12T19:21:18+05:30 IST

విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ (Railway Zone) ఏర్పాటవుతుందా?.. లేదా?...అని అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) పర్యటన సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) దానికి స్పష్టత ఇచ్చారు.

Visakha Railway: విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయం కోసం రూ.106 కోట్లు

విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ (Railway Zone) ఏర్పాటవుతుందా?.. లేదా?...అని అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) పర్యటన సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) దానికి స్పష్టత ఇచ్చారు. రైల్వే బోర్డు చైర్మన్‌, సీఈఓ వీకే త్రిపాఠి, జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎన్‌ సుంకర్‌, డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పథిలతో కలిసి శుక్రవారం అర్ధరాత్రి కొత్త రైల్వే జోన్‌ కేంద్ర కార్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన వైర్‌లెస్‌ కాలనీలోని స్థలాన్ని సందర్శించారు.

ఆయన ఆ ప్రాంతాన్ని, విస్తీర్ణాన్ని పరిశీలించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయ భవన నిర్మాణం కోసం గురువారం రైల్వే బోర్డు రూ.106 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వస్తాయన్నారు. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ పునర్మిర్మాణానికి రూ.466 కోట్లతో పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇవి పూర్తయితే రోజుకు 75 వేల మంది ప్రయాణికులు విశాఖపట్నం స్టేషన్‌ నుంచి ప్రయాణం చేయవచ్చునన్నారు. ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Updated Date - 2022-11-12T19:58:16+05:30 IST