Janasena: హత్యలకు, అవినీతికి వైసీపీ బ్రాండ్ అంబాసిడర్

ABN , First Publish Date - 2022-12-20T14:44:38+05:30 IST

వైసీపీ(YCP) అంటేనే హత్యలకు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు(Janasena PAC member Kona Tatarao) ఆరోపించారు. ఆయన మీడియాతో

Janasena: హత్యలకు, అవినీతికి వైసీపీ బ్రాండ్ అంబాసిడర్
హత్యలకు, అవినీతికి వైసీపీ బ్రాండ్ అంబాసిడర్

విశాఖ: వైసీపీ(YCP) అంటేనే హత్యలకు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు(Janasena PAC member Kona Tatarao) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) విలువలు తాకట్టు పెడుతూ మాట్లాడుతున్నారు. కౌలు రైతులను ఆదుకోవల్సి‌న పని ప్రభుత్వానిది. ఆ బాధ్యత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సొంత నిధులతో చేపడితే తప్పుపడతారా? కానీ సాంకేతిక సమస్యలను తప్పించుకుంటారా? వారాహి వాహనం చూసి మీకు నిద్రపట్టడంలేదు. వారానికి ఒకసారి పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వస్తేనే భయపడుతున్నారు‌‌. ఇక వారాహి వాహనంలో ప్రతిరోజూ ప్రజల్లోకి వస్తే మీ పరిస్థితి ఏంటి? హత్యా రాజకీయాలతో ప్రజల గొంతునొక్కాలని చూస్తున్నారు‌‌. జగన్(Cm jagan) ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు ఎవరి పల్లకి మోయాల్సిన అవసరంలేదు‌‌‌. జగన్ ఎక్కడ నవ్వాలో.. ఎక్కడ ఏడ్వాలో సజ్జల రామకృష్ణా రెడ్డి జగన్‌కు స్క్రిప్ట్ రాసివ్వాలి‌‌. చంచల్‌‌గూడలో పుట్టిన పార్టీ ప్రజలకు ఎలా మేలు చేయగలదు.. దోచుకోవడం తప్పితే. జగన్‌ది దొంగల పార్టీ.... జైలు పార్టీ.’’ అని విమర్శించారు.

Updated Date - 2022-12-20T14:44:40+05:30 IST