TDP: పెదరావిగూడెంలో ‘ఇదేం ఖర్మ మనరాష్ట్రం’ కార్యక్రమం ప్రారంభం
ABN , First Publish Date - 2022-12-29T14:36:23+05:30 IST
జిల్లాలోని కుక్కునూరు మండలం పెదరావిగూడెం గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని...
ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు మండలం పెదరావిగూడెం గ్రామంలో ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు (TDP Leaders) గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజల తరపున టీడీపీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా +91 92612 92612 నంబరుకు అందరితో మిస్డ్ కాల్ ఇప్పించాలని నాయకులకు, కార్యకర్తలకు బొరగం శ్రీనివాసులు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ములిశెట్టి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కర్రి వెంకట రామారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు బొక్కా బాబురావు, ఐటిడిపి ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు శావిలి సుభాస్ చంద్రబోస్, తెలుగుమహిళా మండల అధ్యక్షురాలు వనమా భాగ్యలక్ష్మి, కాటూరి వెంకటేశ్వర్లు, బొక్కా శ్రీను, ఊరకరనం సాంబ, పల్లాల వెంకటేశ్వర్లు, పల్లెల సురేష్, బొక్కా రమేష్, పల్లాల పెద్దిరాజు , పానగల్ల శ్రీను, వేములపల్లి అశోక్, కొప్పుల సతీష్, అర్జున్, కొవ్వాసి శ్రీను, మాదినేని పద్మవతి, రుద్రరాజు రమణరాజు, కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.