Tellam Balaraju: పొంగుటూరులో గడప గడపకు పోలవరం ఎమ్మెల్యే...
ABN , First Publish Date - 2022-11-22T15:00:44+05:30 IST
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పొంగుటూరులో పర్యటించారు.
ఏలూరు: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (Tellam Balaraju) పొంగుటూరులో పర్యటించారు. జిల్లాలోని కొయ్యలగూడెం మండలం పొంగుటూరు సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. తక్షణం పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే గ్రామంలో దీర్ఘ కాలిక ప్రాధాన్యతమున్న పనులను గుర్తిస్తూ ఎమ్మెల్యే బాలరాజు (YCP MLA) ముందుకు సాగారు.