Stock Markets: 2022లో రికార్డ్ నెలకొల్పిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇప్పటివరకు..

ABN , First Publish Date - 2022-12-31T17:23:16+05:30 IST

దేశీయ మార్కెట్ సూచీలు బీఎస్‌‌ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 (NSE Nifty) సూచీలు ఒక క్యాలెండర్ ఏడాదిలో చివరిసారిగా 2015లో నష్టాల్లో ముగిశాయి. ఈ విషయాన్ని ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే..

Stock Markets: 2022లో రికార్డ్ నెలకొల్పిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇప్పటివరకు..

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్ సూచీలు బీఎస్‌‌ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 (NSE Nifty) సూచీలు ఒక క్యాలెండర్ ఏడాదిలో చివరిసారిగా 2015లో నష్టాల్లో ముగిశాయి. ఈ విషయాన్ని ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే.. 2022లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సానుకూలంగా ముగియడంతో కొత్త రికార్డ్ నమోదయ్యింది. రికార్డ్ స్థాయిలో వరుసగా 7వ ఏడాదిలో కూడా సూచీలు లాభాల్లో ముగిసినట్టయ్యింది. దీంతో మార్కెట్లు వరుసగా అత్యధిక కాలం లాభాల్లో సాగిన పిరియడ్‌గా 2015 - 2022 నిలిచింది. అంతకుముందు 2002 - 2007 మధ్య ఆరేళ్లపాటు మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసినట్టయ్యింది.

కాగా ముగిసిన ఏడాది 2022లో దేశీయ మార్కెట్లు సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) సరికొత్త గరిష్ఠాలను తాకాయి. లాభనష్టాల మధ్య పయనిస్తూ ఏడాది చివరికి సింగిల్ డిజిట్ వృద్ధిని కనబరిచాయి. క్యాలెండర్ ఏడాది 2022లో సెన్సెక్స్ 5.78 శాతం, నిఫ్టీ 4.33 శాతం చొప్పున లాభపడ్డాయి. దీంతో 2016 నుంచి ఇప్పటివరకు సెన్సెక్స్ 34,723.20 పాయింట్లు లేదా 133 శాతం వృద్ధి చెందగా.. నిఫ్టీ సూచీ 10,159 పాయింట్లు లేదా సుమారు 128 శాతం మేర లాభపడినట్టయ్యింది.

2016 నుంచి సూచీల గమనం..

సంవత్సరం సెన్సెక్స్ నిఫ్టీ

2016 1.95 శాతం 3.01 శాతం

2017 27.91 శాతం 28.64 శాతం

2018 5.91 శాతం 3.16 శాతం

2019 14.38 శాతం 12.02 శాతం

2020 15.75 శాతం 14.90 శాతం

2021 20.45 శాతం 24.12 శాతం

2022 5.78 శాతం 4.33 శాతం.

Updated Date - 2022-12-31T17:24:25+05:30 IST