BJP: బెంగాల్‌లో బీజేపీ నేతను ఈడ్చిపడేసి లాగిపెట్టి కొట్టిన సొంతపార్టీ నేత

ABN , First Publish Date - 2022-11-06T16:57:56+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నేతపై సొంత పార్టీ నేత దాడి చేశారు. ఆయనను ఈడ్చిపడేసి లాగిపెట్టి కొట్టాడు

 BJP: బెంగాల్‌లో బీజేపీ నేతను ఈడ్చిపడేసి లాగిపెట్టి కొట్టిన సొంతపార్టీ నేత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నేతపై సొంత పార్టీ నేత దాడి చేశారు. ఆయనను ఈడ్చిపడేసి లాగిపెట్టి కొట్టాడు. పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన మొత్తం కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆపై అది సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. బీజేపీ మండలాధ్యక్షుడైన ఠాకూర్ దాస్ మిద్దా మిడ్నాపూర్‌ (midnapur)లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ గుచైత్ జెండాల కోసం అక్కడికి వచ్చారు. దీంతో గతంలో చేసిన ఖర్చులకు సంబంధించిన లెక్కలను సమర్పించాల్సిందిగా ఠాకూర్ దాస్ ఆయనను అడగడంతో అది వాగ్వివాదానికి దారితీసింది.

అది మరింత ముదరడంతో శంకర్‌ను పట్టుకుని లాగి పడేసిన ఠాకూర్ ఆపై ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. గమనించిన ఇతర నేతలు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి రావడంతో అధికార టీఎంసీ స్పందించింది. బీజేపీ అసలు రంగు ఇదేనని టీఎంసీ స్థానిక నేత అజిత్ మైతి విమర్శించారు. ఈ ఘటనపై శంకర్ గుచైత్ మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజీని పార్టీ పెద్దలకు సమర్పిస్తానని అన్నారు.

Updated Date - 2022-11-06T16:57:57+05:30 IST