Delhi: బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలు
ABN , First Publish Date - 2022-12-05T14:12:15+05:30 IST
ఢిల్లీ: బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రారంభించారు.
ఢిల్లీ: బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో జరగనున్న ఈ సమావేశాలకు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, రాష్ట్రాల ఇన్చార్జులు హాజరయ్యారు. ప్రజా సంగ్రామయాత్రలో ఉండడంతో బండి సంజయ్ ఈ సమావేశాలకు హాజరుకాలేకపోతున్నారు. పార్టీ బలోపేతానికి కావాల్సిన చర్యలపై చర్చించి.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి పురంధేశ్వరి, డీకే అరుణ, లక్ష్మణ్, సత్యకుమార్, మురళీధరరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సోమువీర్రాజు ఈ సమావేశాలకు హాజరయ్యారు.