Agnipath scheme: కాంగ్రెస్‌కి అధికారం వస్తే అగ్నిపథ్ రద్దు...

ABN , First Publish Date - 2022-11-04T17:18:31+05:30 IST

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ పార్టీ అధికారం చేపడితే అగ్నిపథ్

Agnipath scheme: కాంగ్రెస్‌కి అధికారం వస్తే అగ్నిపథ్ రద్దు...
Priyanka Gandhi Vadra

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ పార్టీ అధికారం చేపడితే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. తాము ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా నెరవేర్చుతామని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా కంగ్రా జిల్లాలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు.

రక్షణ దళాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం (Agnipath scheme)ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం క్రింద ఎంపికలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వస్తున్నప్పటికీ ఈ పథకాన్ని ఉపసంహరించేది లేదని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2022 జూన్ 14న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం క్రింద నాలుగేళ్ళ స్వల్పకాలిక నియామకాల కోసం యువతను ఎంపిక చేసి, శిక్షణ ఇస్తారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్కులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. సంవత్సరానికి 46 వేల మంది అగ్నివీరులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 40 వేల మందిని సైన్యం, మూడు వేల మందిని నావికా దళం, మూడు వేల మందిని వాయు సేన ఎంపిక చేస్తాయి. వీరికి నెలవారీ పారితోషికంతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అందజేస్తుంది. బీమాతోపాటు పదవీ విరమణ అనంతరం సొమ్ము కూడా లభిస్తుంది.

ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) శుక్రవారం కంగ్రా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, కేంద్రంలో తమ పార్టీ అధికారం చేపడితే, మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. తాము వాగ్దానం చేస్తే, కచ్చితంగా దానిని నెరవేర్చుతామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో రైతులకు రుణాలను రద్దు చేస్తామని చెప్పామని, దానిని అమలు చేశామని తెలిపారు.

Updated Date - 2022-11-04T18:05:08+05:30 IST