Rahul Gandhi: బీజేపీ నాకు గురువులాంటిది

ABN , First Publish Date - 2022-12-31T14:10:50+05:30 IST

భారతీయ జనతా పార్టీని తాను గురువుగా భవిస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. వారే తనకు ఒక మార్గాన్ని చూపించారని..

Rahul Gandhi: బీజేపీ నాకు గురువులాంటిది

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని తాను గురువు (Teacher)గా భావిస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వారే తనకు ఒక మార్గాన్ని చూపించారని, ఏమి చేయకూడదో తనకు ఎప్పటికప్పుడు చెబుతుంటారని అన్నారు. శనివారంనాడిక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తన మీద మరిన్ని తీవ్ర ఆరోపణలు చేయాలని కోరుకుంటున్నానని, అందువల్ల వారి భావజాలం ఏమిటో తాను అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ తాను యాత్ర ప్రారంభించినప్పుడు ఇదొక సాధారణ యాత్రగానే తాను తీసుకున్నానని, కానీ ఈ యాత్రకి ఎన్నో స్వరాలు, అనుభవాలు ఉన్నాయని మెల్లమెల్లగా అర్ధం చేసుకున్నానని చెప్పారు. ఇందుకు గాను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. వారు ఎంత ఎక్కువగా టార్గెట్ చేస్తే, అంతే స్థాయిలో కానీ మరో రూపంలో కానీ తమకు మేలు చేసినట్టని అన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉందన్నారు. తమతో కలవాలని వచ్చే ఎవరినీ అడ్డుకోమని స్పష్టం చేశారు. అఖిలేష్, మాయావతి, ఇతరులు ప్రేమపూర్వక హిందుస్థాన్ కావాలనుకుంటున్నారని, భావజాలం విషయంలో తమ మధ్య సాన్నిహిత్యం ఉందని రాహుల్ తెలిపారు.శ

Updated Date - 2022-12-31T14:46:26+05:30 IST