Gujarat Assembly Election 2022: మళ్లీ బీజేపీకే అధికారం... ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడి

ABN , First Publish Date - 2022-11-04T21:53:56+05:30 IST

గాంధీనగర్: డిసెంబర్ 1, 5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election)లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.

Gujarat Assembly Election 2022: మళ్లీ బీజేపీకే అధికారం... ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడి
Bharatiya Janata Party

గాంధీనగర్: డిసెంబర్ 1, 5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election)లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి 119 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ (Indian National Congress)కి 59 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)కి 3 స్థానాల్లో విజయం దక్కవచ్చని అంచనావేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలుచుకున్న కమలనాథులు ఈ సారి అదనంగా మరో 20 స్థానాలు గెలుచుకుంటారని తెలిపింది. గత ఎన్నికల్లో 77 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి 22 స్థానాలను కోల్పోనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవనుంది. కనీసం 3 చోట్ల ఆప్ గెలిచే అవకాశాలున్నాయని ఇండియా టీవీ మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్‌ అంచనా వేసింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో కూడా బీజేపీ మరోమారు విజయకేతనం ఎగురవేస్తుందని ఇండియా టీవీ మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్‌ వెల్లడించింది.

ఇవి అంచనాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు డిసెంబర్ 8వ తేదీన వెలువడతాయి.

Updated Date - 2022-11-04T23:41:05+05:30 IST