Delhi Air Pollution: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం...ప్రజలకు వర్క్ ఫ్రం హోం, కార్ పూల్ సలహా

ABN , First Publish Date - 2022-12-31T11:34:04+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రతరం కావడంతో ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం...

Delhi Air Pollution: ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం...ప్రజలకు వర్క్ ఫ్రం హోం, కార్ పూల్ సలహా
Delhi Air Pollution

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ తీవ్రతరం కావడంతో ఢిల్లీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.(Delhi Air Pollution) కొత్త సంవత్సరం వేళ ఆదివారం ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లలో వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో భవన నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేశారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తీవ్రమైన కాలుష్య కేటగిరీలోకి పోయే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ సబ్‌కమిటీ జరిపిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రజలు ఇంటి నుంచి పని చేయాలని, లేదా కార్‌పూల్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఢిల్లీ అధికారులు సూచించారు.( WFH, Carpool)బీఎస్ 3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ ఫోర్-వీలర్లను ఉపయోగించడంపై నిషేధం విధించాలా వద్దా అనే విషయంపై ఢిల్లీ ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకోనుంది.( Advised)

ప్లంబింగ్, కార్పెంటరీ, ఇంటీరియర్ డెకరేషన్, ఎలక్ట్రికల్ పనులు వంటి కాలుష్య రహిత కార్యకలాపాలను అనుమతించనున్నారు.ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బొగ్గు,అనుమతి లేని ఇంధనాలను ఉపయోగించే పరిశ్రమలను జనవరి 1వతేదీ నుంచి మూసివేస్తామని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ తెలిపింది.

Updated Date - 2022-12-31T11:34:06+05:30 IST