బహుమతులతో G-20 నేతల మనసు దోచేసిన మోదీ
ABN , First Publish Date - 2022-11-16T18:56:44+05:30 IST
బాలి: ఇండొనేషియా బాలిలో జరుగుతోన్న G-20 సమావేశాల్లో (Indonesia G20 Summit) కూటమి దేశాధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదిరిపోయే బహుమతులిచ్చారు.
బాలి: ఇండొనేషియా బాలిలో జరుగుతోన్న G-20 సమావేశాల్లో (Indonesia G20 Summit) కూటమి దేశాధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదిరిపోయే బహుమతులిచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు శృంగార రస కాంగ్రా మీనియేచర్ పెయింటింగ్‌ను బహుకరించారు. పచ్చని ప్రకృతిలో రాధాకృష్ణులున్న ఈ పెయింటింగ్‌ను హిమాచల్ ప్రదేశ్ కళాకారులు దీన్ని తయారుచేశారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జగన్మాతను చిత్రించిన వస్త్రాన్ని బహుకరించారు. గుజరాత్ చేనేత కార్మికులు దీన్ని తయారుచేశారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంతొనీకి ఫితోరా గిరిజన జానపద కళాకృతిని బహుకరించారు. ఆస్ట్రేలియాలోని ఆదివాసీలను సంప్రదాయ కళలను గుర్తు చేసేలా మోదీ దీన్ని బహుకరించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్‌కు, సింగపూర్ ప్రధాని లీ లూంగ్‌కు, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్‌కు గుజరాత్ కచ్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన బౌల్ బహుకరించారు.
ఇండొనేషియా అధ్యక్షుడు జోకో విడిడోకు హిమాచల్ ప్రదేశ్ నుంచి తెప్పించిన వెండిగిన్నె బహుకరించారు.
ఇలా ఒక్కో నాయకుడికి ఒక్కో రకంగా భారత సంస్కృతిని, సంప్రదాయాలను, కళలను పరిచయం చేసేలా మోదీ ప్రత్యేకమైన బహుమతులు అందించారు.
Narendra Modi: సరైన సమయంలో సరైన ఎత్తుగడ
జీ20 కూటమిలో అమెరికా, ఆస్రేలియా, కెనడా, సౌదీ అరేబియా, రష్యా, దక్షిణాఫ్రికా, టర్కీ, అర్జెంటైనా, బ్రెజిల్, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, చైనా, ఇండొనేషియా, జపాన్, దక్షిణకొరియా, భారత్ ఉన్నాయి. పర్యావరణం, ఆర్ధిక రంగం సహా అనేక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు సంభవిస్తోన్న తరుణంలో శక్తిమంతమైన జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతలు భారత్‌కు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
G20 Summit: గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి షేక్‌హ్యాండ్