Bharat Jodo Yatra : పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరవుతారా?

ABN , First Publish Date - 2022-11-12T16:08:37+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరయ్యే

Bharat Jodo Yatra : పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరవుతారా?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరవడానికి బదులుగా ఈ యాత్రనే కొనసాగించబోతున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) శనివారం మీడియాకు ఈ వివరాలను తెలిపారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరయ్యే అవకాశం లేదని జైరామ్ చెప్పారు. ఆయన భారత్ జోడో యాత్ర చేస్తుండటమే దీనికి కారణమని చెప్పారు. ఈ సమావేశాల కోసం యాత్రను వాయిదా వేయబోరని తెలిపారు. కులాలవారీ జనగణన, రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరి ఏమిటని ప్రశ్నించినపుడు జైరామ్ మాట్లాడుతూ, ఈ అంశంపై తమ పార్టీ 2014 నుంచి స్థిరమైన వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రస్తుతం ఇస్తున్న రిజర్వేషన్లకు విఘాతం కలగకుండా అన్ని కులాల్లోనూ ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని తమ పార్టీ సమర్థిస్తుందని చెప్పారు. కులాలవారీ జనగణన సత్వరమే జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రధాన జనగణన జరిగినపుడు కులాలవారీ జనగణన కూడా అవసరమేనని చెప్పారు. కులాలవారీ జనగణన జరగకపోతే రిజర్వేషన్ల అమలుకు ప్రాతిపదిక ఏది? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లను దేని ఆధారంగా ఇస్తున్నారనే సమాచారం తాజాగా (ఎప్పటికప్పుడు ప్రస్తుతానికి సంబంధించినది అయి) ఉండాలని చెప్పారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో...

ఈ యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబరు 7 నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్‌ తర్వాత ప్రస్తుతం మహారాష్ట్రలో పాదయాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్ చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది.

పార్లమెంటు సమావేశాలు వచ్చే నెల 7 నుంచి

పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament winter session) డిసెంబరు 7 నుంచి 29 వరకు జరిగే అవకాశం ఉంది. దాదాపు 17 పని దినాల్లో ఈ సెషన్‌ జరుగుతుందని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ అధ్యక్షతన జరిగే తొలి సమావేశాలు ఇవే. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టి, ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో మరొకరిని ఆ పార్టీ ఎంపిక చేయవలసి ఉంది.

Updated Date - 2022-11-12T16:14:22+05:30 IST