Uddhav Thackeray: మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధం
ABN , First Publish Date - 2022-11-05T19:59:37+05:30 IST
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.
ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర (Maharashtra)లో మధ్యంతర ఎన్నికలు రావచ్చని ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) అంచనా వేశారు. ఇందుకు సంబంధించి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ముంబైలోని పార్టీ ప్రధాన కార్యాలయం ‘సేన భవన్’లో జరిగిన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఉద్ధవ్ ఎన్నికల గురించి మాట్లాడారు.
రాష్ట్రంలో త్వరలో మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయని, ఎన్నికలను ఎదుర్కొందుకు కార్యకర్తలు సన్నద్ధమవ్వాలని శివసేన పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి అర్వింద్ సావంత్ తెలిపారు. మధ్యంతర ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో గురువారం రోజు మహారాష్ట్రకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ. 2 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారని అర్వింద్ సావంత్ గుర్తు చేశారు.