CM Jagan Birthday: దుబాయిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2022-12-22T13:19:09+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు (CM Jagan Birthday Celebrations) విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు (CM Jagan Birthday Celebrations) విదేశాలలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలలో వైఎస్ఆర్‌సీపీ (YSRCP) అభిమానులు తమకు వీలయిన చోట్ల అభిమానంతో తమ ప్రియనేత జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దుబాయిలోని వైఎస్ఆర్‌సీపీ అభిమానులు బుధవారం జగన్ జన్మదినోత్సవ వేడుకలను సందడిగా నిర్వహించారు. గల్ఫ్ దేశాలలో స్ధానిక అరబ్ ప్రజలకు ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల తరహా ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అందిస్తున్నారని, ఈ సంక్షేమ పాలన ఇదే తరహా కొనసాగాలని కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త సత్తి ప్రసన్న సోమిరెడ్డి అకాంక్షించారు.
సోమిరెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పడాల బహ్మానందరెడ్డి, తరపట్ల మోహన్, మోహమ్మద్ అక్రం, కోటేశ్వరరెడ్డి, కర్ణ మహేశ్, శివలింగారెడ్డి, నరసింహా, బాషా, షాకీర్, అంజద్, సత్య, విజయ, భూమ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. షార్జా, అబుధాబిలతో పాటు కువైత్‌లో కూడా జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పార్టీ ప్రవాసీ నాయకులు తెలిపారు.