Mahzooz Raffle: జాక్‌పాట్ కొట్టిన భారతీయ మహిళ... ఎంత గెలుచుకుందంటే..
ABN , First Publish Date - 2022-11-20T07:53:21+05:30 IST
మహజూజ్ రాఫెల్ డ్రాలో (Mahzooz Raffle Draw) ముగ్గురు ప్రవాసులు (Expats) చెరో లక్ష దిర్హమ్స్ (రూ.22.19లక్షలు) గెలుచుకున్నారు.
దుబాయ్: మహజూజ్ రాఫెల్ డ్రాలో (Mahzooz Raffle Draw) ముగ్గురు ప్రవాసులు (Expats) చెరో లక్ష దిర్హమ్స్ (రూ.22.19లక్షలు) గెలుచుకున్నారు. ఇందులో భారతీయ మహిళ మేరీ (43)తో పాటు ఇద్దరు ఫిలిప్పీన్స్ వాసులు జెన్నీఫర్ (44), ఎలుటెరియో (40) ఉన్నారు. తాజాగా దుబాయ్‌లో (Dubai) తీసిన డ్రాలో ఈ ముగ్గురు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా మేరీ మాట్లాడుతూ.. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా తాను వరుసగా మహజూజ్ డ్రాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఇక తాను గెలిచిన నగదులో ఎక్కువ భాగం తన కూతురి చదువుల కోసం వినియోగిస్తానని చెప్పారు. అలాగే మరికొంత భాగాన్ని చారిటీకి ఇస్తానన్నారు. తన స్నేహితులకు పార్టీ ఇచ్చి ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటానని మేరీ చెప్పుకొచ్చారు. మేరీతో పాటు ఈ డ్రాలో విజేతగా నిలిచిన మిగతా ఇద్దరు ఫిలిప్పీన్ ప్రవాసులు కూడా తాము గెలిచిన నగదులో కొంత భాగాన్ని స్వచ్చంధ సంస్థలకు విరాళంగా ఇస్తామని చెప్పారు.