Visit Visa: బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై విజిట్ వీసా చాలా ఈజీ

ABN , First Publish Date - 2022-12-17T07:03:55+05:30 IST

పర్యటన నిమిత్తం బ్రిటన్‌ వెళ్లనున్న వారికి ఇకపై దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే విజిట్‌ వీసాలు (Visit Visas) అందనున్నాయి.

Visit Visa: బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. ఇకపై విజిట్ వీసా చాలా ఈజీ

15 రోజుల్లోనే బ్రిటన్‌ విజిట్‌ వీసా: హైకమిషనర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 16: పర్యటన నిమిత్తం బ్రిటన్‌ వెళ్లనున్న వారికి ఇకపై దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే విజిట్‌ వీసాలు (Visit Visas) అందనున్నాయి. ఈ విషయాన్ని బ్రిటిష్‌ హైకమిషనర్‌ అలెక్స్‌ ఎల్లీస్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి 15 రోజుల్లోనే విజిట్‌ వీసా ఇస్తామని రెండు నెలల క్రితం ప్రకటించామని గుర్తు చేశారు. ఇంకా ముందుగానే కావాలనుకుంటే ‘ప్రయారిటీ వీసా విధానా’న్ని కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఆ మార్గంలో అయితే అయిదు రోజుల్లోనే వీసా వస్తుందని చెప్పారు. భారీ సంఖ్యలో స్టూడెంట్‌ వీసాలను కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరిలో ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఈ వీసాలకు డిమాండు అధికంగా ఉన్నందున త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2022-12-17T07:03:56+05:30 IST