Perninani: బందరు పోర్టుపై టీడీపీ విమర్శలు సరికాదు
ABN , First Publish Date - 2022-11-08T17:17:34+05:30 IST
టీడీపీ (TDP) నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra)పై వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని (YCP MLA Perninani) విమర్శలు గుప్పించారు.
గుంటూరు: టీడీపీ (TDP) నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra)పై వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని (YCP MLA Perninani) విమర్శలు గుప్పించారు. బందరు పోర్టు (Bandar Port)పై టీడీపీ విమర్శలు సరికాదని పేర్ని నాని అన్నారు. గత ప్రభుత్వంలో బందరు పోర్టును ఏ మేరకు నిర్మాణం చేశారో చెప్పాలి? అని పేర్నినాని ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర తన అంతరాత్మను ప్రశ్నించుకోవాలని పేర్నినాని సూచించారు. ఓ శంకుస్థాపన రాయి వేస్తే పోర్టు నిర్మాణం చేసినట్టేనా? అని పేర్నినాని కొల్లు రవీంద్రను ప్రశ్నించారు.