ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా..? 70 ఏళ్ల వృద్ధురాలిపై 55 ఏళ్ల వ్యక్తి దారుణమిదీ..!

ABN , First Publish Date - 2022-12-15T18:25:07+05:30 IST

కాటికి కాళ్లు చాపే వయసులో ఉన్న సమయంలోనూ కొందరు వృద్ధులు.. కామాంధులుగా మారుతుంటారు. బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా..

ఛీ..ఛీ.. మరీ ఇంత నీచమా..? 70 ఏళ్ల వృద్ధురాలిపై 55 ఏళ్ల వ్యక్తి దారుణమిదీ..!
ప్రతీకాత్మక చిత్రం

కాటికి కాళ్లు చాపే వయసులో ఉన్న సమయంలోనూ కొందరు వృద్ధులు.. కామాంధులుగా మారుతుంటారు. బాలికలు, యువతులు, మహిళలు.. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ వక్ర దృష్టితో చూస్తుంటారు. మధ్యప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. 55 ఏళ్ల వృద్ధుడు.. 70 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులంతా ఛీ.. ఛీ.. మరీ ఇంత నీచమా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బావిలో పడిందేమోనని రెస్క్యూ ఆపరేషన్.. ఇంట్లో హాయిగా నిద్రపోయిన పదేళ్ల బాలిక..!

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) పరిధి నర్మదాపురం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక గిరిజన ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు (old woman) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పనులకు వెళ్లారు. అదే సమయంలో స్థానిక ప్రాంతానికి చెందిన అమర్ సింగ్ అనే 55 ఏళ్ల వృద్ధుడు (old man).. వృద్ధురాలి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని వృద్ధురాలి నోరు మూసి అఘాయిత్యానికి (Indecent behavior) పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో వృద్ధురాలికి తీవ్ర రక్తస్రావం అయింది.

old-women.jpg

రెండో పెళ్లి కావడం లేదని దిగులు.. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో..

రాత్రి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఆరాతీశారు. అయితే బుధవారం మధ్యాహ్నం వరకూ ఆమెకు రక్తస్రావం అవుతూనే ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. వృద్ధురాలిని విచారించిన అనంతరం.. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న వృద్ధుడి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Private photos: తండ్రి ల్యాప్‍‌టాప్‌లో కూతురు ప్రైవేట్ ఫొటోలు.. ఇల్లు ఊడుస్తూ అనుకోకుండా ఆన్ చేసిన యువతి.. చివరకు..

Updated Date - 2022-12-15T18:25:12+05:30 IST