Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లి వేడుకలో ఇతడు వేసిన డాన్స్ చూసి బంధువులంతా రచ్చ రచ్చ..!
ABN , First Publish Date - 2022-11-25T21:23:45+05:30 IST
వివాహం అంటేనే బంధువులంతా కలసుకుని, యోగక్షేమాలు తెలుసుకుని.. జోకులు వేసుకుంటూ ఆనందంగా గడపడం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేసి.. సందడి వాతావరణాన్ని మరింత..
![Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లి వేడుకలో ఇతడు వేసిన డాన్స్ చూసి బంధువులంతా రచ్చ రచ్చ..!](https://media.andhrajyothy.com/media/2022/20221123/man_dance_fa683b7772.jpg)
వివాహం అంటేనే బంధువులంతా కలసుకుని, యోగక్షేమాలు తెలుసుకుని.. జోకులు వేసుకుంటూ ఆనందంగా గడపడం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేసి.. సందడి వాతావరణాన్ని మరింత ఉత్సాహం, ఉల్లాసంగా మారుస్తుంటారు. మరికొందరు వయసుతో నిమిత్తం లేకుండా డాన్సులు చేస్తూ అందరిలో మరింత జోష్ నింపుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో (Wedding photos videos) తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన ఓ వీడియో (Dance videos) వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో వేసిన డాన్స్ చూసి అంతా ఈలలు, కేకలతో రచ్చ రచ్చ చేశారు.
ట్విట్టర్‌లో ఓ వీడియో తెగ వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ కళ్యాణ మంటపం.. బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో కళకళలాడుతూ ఉంటుంది. అదే సమయంలో అందరిలో జోష్ నింపేందుకు ఓ వ్యక్తి ముందుకు వస్తాడు. ఓ హిందీ పాటకు చూడముచ్చటగా కాలు కదిపి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ పాటను ఆస్వాదిస్తూ.. ఎక్కడా బిడియం లేకుండా అతడు వేసిన డాన్స్ చూసి.. అక్కడున్న వారంతా ఈలలు, కేకలు వేస్తూ ఎంకరేజ్ చేశారు. 42సెకన్ల నిడివికల ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ అంకుల్ వేసిన డాన్స్ ఫిదా అయ్యాం.. అంటూ కొందరు, ఇతడి డాన్స్ ముందు హీరోయిన్ డాన్స్ కూడా దిగదుడుపే.. అంటూ మరికొందరు.. ఇలాంటి డాన్స్ మేము ఎప్పుడూ చూడలేదు.. అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: ఇదేం వింత.. చెప్పును తీసుకుని ఈ పాము ఏం చేస్తోందో మీరే చూడండి..!